Tuesday, May 26, 2015

శ్రీకృష్ణ

గోవింద గోవింద హరే హరే
శ్రీకృష్ణ గోవింద హరే హరే
గోపీ లోల హరే హరే
రాధ మాధవ హరే హరే

నీవు పలికించే మోహన మురళి
నీ మృదు పాద మంజీర రవళి
అందంగా మెరిసే నీ లలాట కస్తూరి
వర్ణింపతరమా నిన్ను పీతాంబరధారి "గో "

నీ సిగలో ఒదిగిన నెమలీక
మెడలో మురిసే పూమాల
కనువిందు చేసే నీ మానస రూపం
కమనీయం నీ దర్శన భాగ్యం "గో "

మనోహరం రాధారమణీయం
సమ్మోహనం నీ లీలామృతం
సుమధురం నీ వాత్సల్యం
పులకించి తరిచెను భక్త జనం "గో "

గోవింద గోవింద హరే హరే
శ్రీకృష్ణ గోవింద హరే హరే ......

Friday, May 22, 2015

మనసు


  మధురమైన మన పయనం లో
  నువ్వు పంచిన ప్రేమ సాక్షిగా
  నా మనసు తెలిపిన సత్యం ....
                                             నా చిరునామా నీ హృదయం....

జీవితం


  భావాలుఎన్నో  మౌనాలుఎన్నో
 ఎవరికీ కనపడని  అంతరంగాలు ఎన్నో

కలిసి నడిచిన సుఖదుఃఖాలు
నడిపించిన ఆశీర్వాదాలు

అలరించిన ఆనందాలు
ఆలోచించిన  క్షణాలు

ఇంకా ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు
జీవితం అందించే మధురాలు

శ్రీ సాయి

శ్రీ గురు పాదం  సద్గురు పాదం
జయగురు పాదం  నమో సాయి పాదం

జగద్గురు సాయి దివ్య పాదం
అందరికి అభయమందించు పాదం
గంగా జమునలు జనించిన పాదం
మోక్షమందించు శ్రీ సాయి పాదం


భక్తుల హృదయాలు ఏలే పాదం
తోడూ నీడై నడిపించే పాదం
జీవన గమనం నిర్దేశించే పాదం
ముల్లోకాలకు మూలాధారమైన పాదం

శ్రీ గురు పాదం  సద్గురు పాదం
జయగురు పాదం  నమో సాయి పాదం